NTR : ఉన్నట్టా.. లేనట్టా ?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బింబిసార. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ అవ్వనుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా పెంచారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చారు. రెండు టైం లైన్ లలో జరిగే కథగా బింబిసార తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తిరుపతిలో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కు బైక్ ర్యాలీతో ఆహ్వానం పలికారు నందమూరి అభిమానులు. ఈ ర్యాలీలో సీఎం ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అభిమానులు. అనంతరం మీడియాతో ముచ్చటించారు కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలోనే బింబిసార పార్ట్ 2 పై ఆసక్తికర వాక్యాలు చేశారు.

రెండు భాగాలుగా తీస్తున్నామని, ఓ సోషియో ఫాంటసీగా బింబిసార వస్తుంది అని వెల్లడించారు. మొదటి భాగం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని అన్నారు. బడ్జెట్ కు ఎక్కడ వెనకాడ లేదని తెలిపారు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేశామన్నారు. అలాగే బింబిసార 2 లో ఎన్టీఆర్ నటించడం లేదని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి బింబిసార 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అని వస్తున్న వార్తలకు బ్రేకులు పడ్డాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా, తాను మరో రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించాడు. అలాగే, సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని అన్నారు. దీన్ని మేజర్, విక్రమ్ సినిమాలు నిరూపించాయని స్పష్టం చేశారు కళ్యాణ్‌ రామ్‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు