RRR: ఆస్కార్ గడ్డపై తారక్, చరణ్ హవా..

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. గత కొన్ని వారాలుగా తెలుగు నాట ఇదే మాట ప్రతిధ్వనించింది. అందరు అనుకున్నట్టే.. సోమవారం జరిగిన ఆస్కార్ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ ఈవెంట్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి, రికార్డుల గురించి తెగ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ స్టార్స్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళి, కీరవాణిపై కూడా చర్చ జరుగుతుంది.

హాలీవుడ్ హీరోల కంటే.. మన ఆర్ఆర్ఆర్ హీరోలు తారక్, రామ్ చరణ్ పైనే ఎక్కువ సెర్చింగ్ జరిగిందట. ఈ విషయాన్ని ప్రముఖ ఇంటెలిజెన్స్ కంపెనీ నెట్ బేస్ క్వాడ్ వెల్లడించింది. ఆస్కార్ అవార్డుల సమయంలో సోషల్ మీడియాలో ఎక్కువ సెర్చ్ చేసిన లిస్ట్ ను ఈ కంపెనీ బయట పెట్టింది. అందులో హాలీవుడ్ స్టార్స్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ డైరెక్టర్ లాంటి ఎంతో మంది దిగ్గజాలను వెనక్కి నెట్టి జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

రెండో స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు. మూడో స్థానంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆస్కార్ అందుకున్న కే హుయే క్వాన్ ఉన్నారు. దీని తర్వాత బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ తీసుకున్న బ్రెండన్ ఫ్రెజర్ ఆ తర్వాత ఐదో స్థానంలో మెక్సికన్ నటుడు పెడ్రో పాస్కల్ ఉన్నాడు.

- Advertisement -

అలాగే సోషల్ మీడియా సెర్చింగ్ లో హాలీవుడ్ దిగ్గజ మూవీలను పక్కకి నెట్టి ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీని తర్వాత మరో భారతీయ చిత్రం ఎలిఫెంట్ విస్పరస్ చోటు దక్కించుకుంది. వీటి తర్వాత ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్.. ఆల్ క్వైట్ వెస్టర్న్ ఫ్రంట్.. చివరిగా ఐదో స్థానంలో అర్జెంటినా 1985 ఉన్నాయి. ఇలా ఆస్కార్ గడ్డపై భారతీయ నటులు, సినిమాలు తమ సత్తాని చాటాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు