NTR : ఇండస్ట్రీకి ‘బ్రహ్మస్రం’

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర. స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు.

అయితే అనివార్య కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. దీంతో మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ “ముందుగా నా అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఎంతో ఆర్భాటంగా వేదిక చేయాలనుకున్నాం. కానీ పోలీసులు భద్రతను కల్పించలేమని అన్నారు. వాళ్లు మన సేఫ్టీ కోసమే చెప్పారు. వారి మాటలను వినాల్సిన బాధ్యత పౌరులుగా మనకుంది” అన్నారు.

అలాగే ” ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ తెలియని ప్రెషర్ కి లోనవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులకు కొత్తగా ఏదో కావాలి. నేను వ్యక్తిగతం చెప్పే విషయం ఏమిటంటే మేం ప్రెజర్ లో ఉన్నప్పుడు అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాం” అని తారక్ చెప్పుకొచ్చారు. “ప్రస్తుతం ఉన్న ఛాలెంజ్ లను అందరూ యాక్సెప్ట్ చేయాలి. మంచి సినిమాలు చేయాలి. బ్రహ్మస్త్ర సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఓ బ్రహ్మస్త్రం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” స్పష్టం చేశారు ఎన్టీఆర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు