Oke Oka Jeevitham : ట్రైమ్ ట్రావెల్ నేపథ్యంలో..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. శర్వా నుంచి ఇటీవలే వచ్చిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం భారీ అంచనాలతో విడుదలై తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం శర్వానంద్ “ఒకే ఒక జీవితం” సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని వినూత్న కథను ఎంచుకున్నాడు. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు తమిళంలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో అక్కినేని అమల ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. టైం ట్రావెల్స్ కథగా తిరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో శర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటీషన్ కు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఆది, శ్రీను, చైతు ముగ్గురు చిన్ననాటి నుండి స్నేహితులు. ఆది సింగర్ కావాలనుకుంటాడు. కానీ అతని తల్లి చిన్నతనంలోనే మృతి చెందుతుంది. దీంతో అతనికి మ్యూజిక్ మీద దృష్టి ఉండదు. ఈ నేపథ్యంలోనే ఒక సైంటిస్ట్ ని చూసే అవకాశం లభిస్తుంది. ఈ చిత్రంలో సైంటిస్ట్ గా నాజర్ కనిపించనున్నారు. టైం ట్రావెల్ మిషన్ తో నాజర్ ఈ ముగ్గురిని గతంలోకి పంపిస్తారు. ఈ ముగ్గురు స్నేహితులు గతంలోకి వెళతారు. అక్కడ హీరో తన తల్లిని చూస్తాడు. కానీ తన తల్లి తన కొడుకుని కనిపెట్టమని పెద్దగా మారిన కొడుకుని అడుగుతుంది.

- Advertisement -

మరి ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది మనం థియేటర్లలోనే చూడాలి అంటున్నారు చిత్ర యూనిట్. ఈ మూవీలో అందాల భామ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు