Prabhas : బాహుబలిని టార్గెట్ చేస్తున్న యంగ్ హీరో నిఖిల్

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల చూపంతా పాన్ ఇండియా సినిమాలపై పడింది. స్టార్ హీరోల నుంచి మొదలు పెడితే యంగ్ హీరోల వరకు అందరు తమ సినిమాలను టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసి, ఇండియా వైడ్ పాపులర్ అవ్వాలని చూస్తున్నారు.

బాహుబలి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో మరింత ఊపందుకుంది. అయితే ప్రస్తుతం మరో టాలీవుడ్ సినిమా బాహుబలిని టార్గెట్ చేస్తూ భారీ స్కెల్ లో పాన్ ఇండియన్ సినిమాగా రూపుదిద్దుకోడానికి రెడీ అవుతోంది.

యంగ్ హీరో నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభు అనే సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి, నిఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

అయితే నిఖిల్ చేస్తున్న ఈ స్వయంభూ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, కెజిఎఫ్ ఫేం రవి బసూర్ మ్యూజిక్ అందిస్తుండగా. విఎఫ్ ఎక్స్ కి గాను బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకి పని చేసిన శ్రీనివాస మోహన్ కుడా ఈ సినిమాకి పని చేయబోతున్నట్టు మూవీ టీం ఎనౌన్స్ చేసారు. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమాని బాహుబలి రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు అర్థం మవుతోంది.

కార్తీకేయ2 సినిమాతో నిఖిల్ కి ఇండియా వైడ్ మార్కెట్ ఏర్పడటంతో ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ భారీ స్కెల్ లోనే ఉంటున్నాయి. ఇప్పటికే నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్పై సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది. మరో పక్క ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావర్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ది ఇండియా హౌస్ పేరుతో మరో సినిమా షూటింగ్ దశలో ఉండగానే, ఈ సినిమాకి సంబందించిన పనులు కూడా మొదలయ్యాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు