Nene vasthunna: విడుదల తేదీ ఖరారు

స్టార్ హీరో ధనుష్ కి కోలీవుడ్ తో పాటు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. “3”,”రఘువరన్ బీటెక్” సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ధనుష్, ఆ తర్వాత “మారి” అసురన్, కర్ణన్ సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. ఇక హీరో ధనుష్ ఇటీవలే “తిరు” తో మంచి విజయం సాధించాడు. ‘కర్ణన్’ తర్వాత ధనుష్ నటించిన నాలుగు సినిమాలు వరుసగా ఓటీటిలో విడుదలయ్యాయి.

అయితే ఈ నాలుగు సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో ధనుష్ ‘తిరు’ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సాధించాడు. ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలు సెట్స్ పై ఉంచాడు. అందులో ‘నానే వరువెన్’ ఒకటి. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదేవిధంగా నిన్ననే డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘సార్’ చిత్ర రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు