RRR: ఆస్కార్ గురి తప్పింది

గుజరాతీ చిత్రం ఛెలో షో (చివరి సినిమా ప్రదర్శన) భారతదేశం నుండి అధికారికంగా ఆస్కార్ కి ఎంపికైంది. మంగళవారం (సెప్టెంబర్ 20) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన చేసింది. రాజమౌళి తెరకెక్కించిన RRR కానీ, అలానే వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన “ది కశ్మీర్ ఫైల్స్” చిత్రం కానీ ఆస్కార్ కి ఎంపిక అవుతుందని చాలామంది ఊహించారు. కానీ ఆ ఉహలన్నీ ఇప్పుడు తలక్రిందులయ్యాయి.
ఎవరు ఊహించని విధంగా ఒక గుజరాతీ చిత్రం ఆస్కార్ కి ఎంపికైంది.

పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. “లాస్ట్ ఫిల్మ్ షో”, 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశం నుండి అధికారికంగా ఎంపికైంది.

సంసారం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన పాన్ నలిన్ దర్శకత్వం వహించిన గుజరాతీ చిత్రం ఛెలో షో (లాస్ట్ ఫిల్మ్ షో). ఈ సినిమా చిన్ననాటి అమాయకత్వాన్ని మరియు సినిమాల మాయాజాలాన్ని గుర్తు చేస్తుంది.గుజరాత్ గ్రామీణ ప్రాంతంలో చిన్నతనంలో సినిమాల పట్ల ప్రేమలో పడిన నళిన్ జ్ఞాపకాల నుండి ఈ చిత్రం ఇన్స్పైర్ అయి చేసాడు.ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 2022న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఛెలో షో చిత్రం ఇటాలియన్ సినిమా అయిన “సినిమా పారడిసో” సినిమాల అనిపిస్తుంది. “సినిమా పారడిసో” అనేది గియుసేప్ టోర్నాటోర్ రచించి దర్శకత్వం వహించిన 1988లో చిత్రం. ఒక చిన్న సిసిలియన్ పట్టణంలో సెట్ చేయబడిన ఈ సినిమాలో ఒక యువకుడికి మరియు మూవీ థియేటర్‌లో పనిచేసే వృద్ధాప్య ప్రొజెక్షనిస్ట్‌కు మధ్య ఉన్న స్నేహన్ని చూపిస్తాడు దర్శకుడు.

- Advertisement -

ఛెలో షో దర్శకుడు పాన్ నలిన్ ఆస్కార్‌కు ఈ చిత్రం ఎంట్రీపై స్పందిస్తూ, “ఇలాంటి రోజు వస్తుందని,వెలుగులు మరియు వేడుకలను తెస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఛెలో షో ప్రపంచం నలుమూలల నుండి ప్రేమను ఆస్వాదిస్తోంది, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు మరియు FFI జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు.అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు