NC22 : షెడ్యూల్‌ పూర్తి

అక్కినేని నాగ‌చైత‌న్య ల‌వ్‌స్టోరి, బంగార్రాజు వంటి సినిమాలు మంచి స‌క్సెస్ అయ్యాయి. ఇక ఆ త‌రువాత మ‌నం ఫేమ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన థ్యాంక్యూ మూవీ చేశాడు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌రువాత బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తో క‌లిసి లాల్‌సింగ్ చ‌డ్డాలో న‌టించిన‌ప్ప‌టికీ ఆ సినిమా కూడా ఆశించిన ఫ‌లితం అందుకోలేక‌పోయింది. మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ‌చైత‌న్య వెంక‌ట్ ప్ర‌భుతో ఓ సినిమా చేస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నాగ‌చైత‌న్య 22వ చిత్రం కావ‌డంతో NC22 అని తాత్కాలికంగా టైటిల్ పెట్టారు. ఈ చిత్రం తాజాగా మైసూర్‌లో ఓ కీల‌క షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమాలో నాగ‌చైత‌న్య పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నార‌ట‌. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న కృతిశెట్టి న‌టించ‌నుంది. ఇటీవ‌లే బంగార్రాజు సినిమాలో ఈ జంట క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్‌ను ఒక్కొక్క‌రిగా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. న‌టి ప్రియ‌మ‌ణి, వెన్నెల‌కిషోర్‌, సంప‌త్‌రాజ్‌, ప్రేమ్ గి అమ‌రేన్‌, వంట‌ల‌క్క వంటి న‌టీన‌టుల‌ను ప్ర‌క‌టించారు.

ముఖ్యంగా స్టార్ న‌టులు అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్‌, ప‌వ‌ర్‌పుల్ పాత్ర‌ల‌ను పోషిస్తున్నార‌ట‌.మ‌రో విశేషం అంటే దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కులు ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా తండ్రి కొడుకులు ఇద్ద‌రూ క‌లిసి సంగీతం అందించ‌డం విశేషం. ఇంత మంది తారాగ‌ణం న‌టిస్తుండ‌డంతో అభిమానులు భారీ అంచనాలు వేసుకుంటున్నారు. వెంక‌ట్ ప్ర‌భు-నాగ‌చైత‌న్య కాంబోలో వ‌చ్చే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు