NBK108 : కథ ఫస్ట్ ఆఫ్ వరకు

నందమూరి బాలయ్య అఖండ విజయం తర్వాత మాస్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పక్కా మాస్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలతో ఈ సినిమా పక్కా మాస్ అని తెలిసిపోతుంది. టైటిల్ లో కూడా మాస్ ఉండాలని జై బాలయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలో బాలయ్య సినిమా ఉండనుంది.

బాలయ్య, అనిల్ రావిపూడి మధ్య వచ్చే సినిమా టైటిల్ ను బ్రో ఐ డోంట్ కేర్ గా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య గత సినిమాల్లాగే మాస్ యాక్షన్ తో పాటు కొంత వరకు కామెడీని కూడా యాడ్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. బాలయ్య ప్రస్తుతం ఎన్బీకే107 షూటింగ్ లోనే ఉండగా, ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట.

తాజాగా ఫస్ట్ ఆఫ్ ను రెడీ చేసి బాలయ్యకు వినిపించినట్లు, బాలయ్యకు నచ్చడంతో ఫస్ట్ ఆఫ్ ను అనిల్ రావిపూడి లాక్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఫస్ట్ ఆఫ్ తెలిపోవడంతో సెకెండ్ ఆఫ్ పై అనిల్ రావిపూడి దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. సెకెండ్ ఆఫ్ ను కూడా త్వరలోనే ఫినిష్ చేసి బాలయ్య ముందుకు తీసుకెళ్లాలని అనిల్ రావిపూడి చూస్తున్నట్టు సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు