Oke Oka Jeevitham: రిలీజ్ కు రెడీ

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా రుపొందుతున్న చిత్రం “ఒకే ఒక జీవితం”. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలోనే ఇప్పుడు “ఒకే ఒక జీవితం” అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ కి తల్లిగా అక్కినేని అమల నటిస్తోంది. వీరిద్దరి మధ్య సాగే ఓ ఎమోషనల్ పాటను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

డియర్ కామ్రేడ్ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ సుజిత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్ లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9నప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటకు విశేషమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండగా.. తాజాగా సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లుగా ఓ వీడియో ద్వారా తెలిపింది చిత్ర బృందం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను శర్వానంద్, అక్కినేని అమల ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు