NBK 109 Update : బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్… అడ్డుగా మారిన లక్కీ భాస్కర్?

NBK 109 Update : గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీని NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సెకండ్ హీరోగా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం దుల్కర్ కు బాలయ్య సినిమాలో నటించడానికి ఓ అడ్డంకి ఏర్పడిందట. ఆయన హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ కారణంగా NBK 109 టీం దుల్కర్ ను సెకండ్ హీరోగా తీసుకునే విషయంలో డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది.

బాలయ్య సినిమాకు ఇబ్బందిగా మారిన లక్కీ భాస్కర్

బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న NBK 109 మూవీలో సెకండ్ హీరో పాత్ర గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. మంచి ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రకు చాలామంది యంగ్ హీరోలను మేకర్స్ సంప్రదిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నేచురల్ స్టార్ నాని ఈ రోల్ కోసం ఫైనల్ అయినట్టుగా టాక్ నడిచింది. కానీ నిజం ఏంటంటే నానిని ఇప్పటివరకు ఈ మూవీ టీం సంప్రదించలేదు. ఇక దుల్కర్ సల్మాన్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే దుల్కర్ ను NBK 109లో సెకండ్ హీరో పాత్రకు ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఫిలిం వర్గాల తాజా సమాచారం ప్రకారం బాలయ్య సినిమాకు దుల్కర్ సల్మాన్ ఇప్పటికే హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ అడ్డంకిగా మారింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నిర్మాత నాగ వంశీ లక్కీ భాస్కర్ అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే ఈ యంగ్ హీరోకు రెమ్యూనరేషన్ అడ్వాన్స్ గా ఇచ్చేసారట నాగ వంశీ. ఇప్పుడేమో బాలయ్య మూవీ కోసం మళ్లీ అడ్వాన్స్ ఇచ్చే విషయంలో దుల్కర్ తో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీకి అడ్వాన్స్ తీసుకోవడంతో NBK 109 టీం దుల్కర్ ను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. డేట్స్ క్లాష్ సమస్య కూడా దీనికి కారణం అంటున్నారు. మరి ఫైనల్ గా ఈ ఇంట్రెస్టింగ్ రోల్ ఏ హీరోకు దక్కుతుందో చూడాలి.

NBK 109కు ఊర మాస్ టైటిల్…

బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న మూవీ NBK 109. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియో బ్యానర్లపై నిర్మాత నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్బీకే 109 మూవీ ( NBK 109 Update ) ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఈ మూవీని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వీరమాస్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు సమాచారం. ఇదే NBK 109 టైటిల్ అని ప్రచారం జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు