Bhanu Priya : స్టార్ డైరెక్టర్ తో ఆగిపోయిన పెళ్లి.. వెలుగులోకి నిజాలు..!

Bhanu Priya : అప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ఇప్పుడు అడపా దడపా సినిమాలలో కనిపిస్తున్న ఈమె .. ఆఫర్లు తక్కువ కావడంమో లేక సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకోవడమో తెలియదు కానీ ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో మాత్రమే కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.అదే ఒక స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి భానుప్రియ పెళ్లి చేసుకోలేకపోయింది.. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఆగిపోవడం వెనుక ఉన్న కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భానుప్రియ లవ్ స్టోరీ..

ప్రస్తుతం ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ భానుప్రియ స్టోరీ హాట్ టాపిక్ గా మారుతోంది. భానుప్రియ కమర్షియల్ సినిమాలు, డివోషనల్ సినిమాలు ఎన్నో చేసింది.. అందులో భాగంగానే దర్శకుడు వంశీతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది.. ఈ సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు వంశీతో మంచి అనుబంధం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. ఇక ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి.. పెళ్లి వరకు వెళ్లాలనుకున్నారు.. దాంతో వీరిద్దరి ప్రేమ అప్పట్లో సంచలనంగా మారి.. పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది..

వంశీ తో పెళ్లి క్యాన్సిల్ అందుకే..

ఇక డైరెక్టర్ వంశీని పెళ్లి చేసుకోవాలనుకున్న భానుప్రియ తన తల్లి వల్ల పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంది.. నిజానికి దర్శకుడు వంశీకి ముందుగానే పెళ్లయింది.. పిల్లలు కూడా ఉన్నారు. పైగా భానుప్రియ తో మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యారు వంశీ.. అంతే కాదు ఏకంగా భానుప్రియ పెద్ద వాళ్లతో కూడా మాట్లాడారు.. ఇంట్లో ఈ విషయాన్ని భానుప్రియ కూడా చెప్పింది.. దీంతో ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. ముఖ్యంగా భానుప్రియ తల్లి కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని చెప్పిందట.. పైగా భానుప్రియని కట్టడి చేసిందట.. అతనికి ఆల్రెడీ పెళ్లి అయింది.. పిల్లలు ఉన్నారు.. అలాంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ మందలించారట.. అలా తన తల్లి కారణంగానే భానుప్రియ వంశీతో వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇక తన అమ్మ తనను అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేస్తుందని నమ్మిన భానుప్రియ.. తన తల్లి మాట మేరకు దర్శకుడితో వివాహానికి ఒప్పుకోలేదు.. ఇక తర్వాత ఎన్నో సంవత్సరం వంశీని తలుచుకుంటూ జీవితం గడిపిందని సమాచారం.

- Advertisement -

భానుప్రియ వైవాహిక జీవితం..

డైరెక్టర్ వంశీ తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత మళ్లీ సినిమాలలోకి వెళ్లిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే.. 1998లో డిజిటల్ గ్రాఫిక్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకుంది.. కాలిఫోర్నియాలో వీరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి అభినయ అనే కూతురు కూడా జన్మించింది. అయితే భానుప్రియ ( Bhanu Priya ) భర్త ఆదర్శ్ 2018లో గుండెపోటుతో మరణించారు. దీంతో ఆమె ఇప్పుడు ఒంటరిగా కూతురితో కలిసి చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం.. మొత్తానికైతే వివాహితుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న భానుప్రియ తన తల్లి కారణంగా వివాహానికి దూరమైంది అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు