Nidhi Agarwal : పవన్ తో పోయిన అదృష్టం.. బాలయ్యతో వరించిందా..?

Nidhi Agarwal : టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ బాగా సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ తమిళంలో ఎన్నో చిత్రాలలో.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అయితే టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించినా పెద్దగా క్రేజ్ మాత్రం అందుకోలేకపోయింది.. తెలుగులో కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాత్రమే పర్వాలేదు అనిపించుకుంది.. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అదృష్టం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లులో వచ్చిన అవకాశం పోయి.. ఇప్పుడు బాలయ్య 109వ చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్ తో పోయిన అదృష్టం..

గతంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది. పవన్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత హరి హర వీరమల్లు షూటింగ్ పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.

బాలయ్యతో మళ్ళీ తిరిగి వచ్చిందా..

అయితే నిధి అగర్వాల్ కు ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ లభించింది.. అదేమిటంటే నందమూరి బాలకృష్ణ.. డైరెక్టర్ బాబి దర్శకత్వంలో రూపొందిస్తున్న NBK -109 చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.. ఈ మధ్యకాలంలో బాలయ్య నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.. అందుకే బాలయ్యతో కలిసి నటించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ కి కొన్ని రోజులు బాలయ్య బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం.. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ NBK -109 చిత్రంలో సెకండ్ హీరో పాత్ర చాలా కీలకంగా ఉంటుందని. ఈ పాత్ర కోసం మొదట దుల్కర్ సల్మాన్ ను సంప్రదించారని.. అలాగే విశ్వక్ సేన్ ను కూడా అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే విశ్వక్ ఈ పాత్రకు సెట్ అవ్వరని చెప్పి రిజెక్ట్ చేసినట్లు సమాచారం.. ఒకవేళ ఈ పాత్రలో సెకండ్ హీరో ఎవరు నటించినప్పటికీ ఆ పాత్రకు జోడిగా మాత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది..

- Advertisement -

దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ ( Nidhi Agarwal ) కి నటించే అవకాశం వచ్చినా.. ఈ సినిమా కొన్ని కారణాల చేత తాత్కాలికంగా ఆగిపోయింది. కానీ అదృష్టం మాత్రం బాలయ్య రూపంలో ఈ ముద్దుగుమ్మకు వరించింది. మరి ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తారేమో చూడాలి.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ వైపు అడుగులు..

గతంలో తెలుగులో అవకాశాలు తగ్గినప్పుడు.. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించినా సక్సెస్ కాలేకపోయింది.. మొదట తెలుగులో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ , ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా పర్వాలేదు అనిపించుకుంది.. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా హీరో అనే సినిమాలో నటించింది. ఇప్పుడు బాలయ్య సరసన అవకాశం వచ్చింది కాబట్టి దీనిని ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు