టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు నాగశౌర్య. 2011లో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. తాను నటించిన మొదటి సినిమా క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ చిత్రానికి జాతీయ అవార్డు రావడంతో అప్పటి నుంచి నాగశౌర్యకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు తదితర చిత్రాల్లో నటించారు. మెగా డాటర్ నిహారికతో కలిసి ఒక మనసు సినిమాలో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.
తాను నటించిన తాజా చిత్ర కృష్ణ వ్రింద విహారి. న్యూజిలాండ్ సింగర్, బాలీవుడ్ నటి షిర్లే సెటియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రసెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఎప్పటి నుంచో విడుదలవుతుందని ప్రచారం చేస్తున్నా ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదల కానుంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదల అయితుందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతుండడం విశేషం. ఈ సినిమా విడుదల సందర్భంగా నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్యకి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. నా పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండవచ్చు. దాదాపుగా తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకోనున్నట్టు వెల్లడించారు.
Read More: Huma Qureshi bold comments : నా బాడీ షేప్స్ సరిగ్గా లేవని అన్నారు
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్ అయినటువంటి ఐరా క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాత ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శరత్‌కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి.
Read More: Pawan kalyan : ఎట్టకేలకు హరి హర వీరమల్లు నుంచి అప్డేట్
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...