Naa Saami Ranga: నాగార్జున “నా సామిరంగ” నుంచి ఫస్ట్ సాంగ్.. అదిరిపోయిందిగా..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మన్మధుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున చాలా కాలం గ్యాప్ తీసుకొని అనౌన్స్ చేసిన తాజా చిత్రం నా సామిరంగ. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు..కానీ సడన్గా వచ్చి సంక్రాంతి రేసులో నిలిచిపోయారు నాగార్జున. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. అలాగే మరొక హీరోయిన్ కూడా ఇందులో నటిస్తోందని.. అయితే ఆమె ఎవరు అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంచినట్లు సమాచారం.

ఇక ప్రముఖ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. శ్రీనివాసు చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తూ ఉంటే నాగార్జున గత సినిమాల లాగే పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా “ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే “అంటూ సాగే ఒక పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం.

- Advertisement -

ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి ఈ పాటకు సంగీతాన్ని అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు.తాజాగా ఈ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున , ఆషికా రంగనాథ్ కలిసి వేసిన స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆరు పదుల వయసులో కూడా నాగార్జున ఎప్పటిలాగే అంతే ఎనర్జిటిక్ గా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఖచ్చితంగా ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున పండుగకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పిన దర్శకనిర్మాతలు ఏ డేట్ ను రిలీజ్ చేస్తారు అన్న విషయాన్ని ప్రకటించలేదు.

ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు లో వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరొకవైపు ఇలా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా నాగార్జున అలరిస్తారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు