Roshan kanakala: తల్లిదండ్రులను అలాంటి ప్రశ్న అడిగి ఇరుకున పెట్టిన రోషన్ కనకాల..!

బబుల్ గమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా.. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాను నటించిన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రోషన్ కనకాల తన తల్లిదండ్రుల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
రీసెంట్ గా రోషన్ మీడియాతో మాట్లాడుతూ.. తన పేరెంట్స్ గురించి ఈ విధంగా తెలిపాడు.. గత కొన్ని దశాబ్దాలుగా యాంకర్ సుమ తన ప్రొఫెషనల్ వర్క్ లో నాన్ స్టాప్ గా దూసుకుపోతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా బుల్లితెర షోలలోనే కాదు ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా సరే సుమా హోస్ట్ గా కనిపిస్తారు. అలాగే సుమా భర్త ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అలా బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తున్న ఈ జంట ప్రేక్షకులను రెండు విధాలుగా అలరిస్తోంది అని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈ జంట గురించి వీరి తనయుడు రోషన్ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. ఇకపోతే నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించిన రోషన్ కి హీరోగా బబుల్ గమ్ మొదటి సినిమా.ఇక రోషన్ మాట్లాడుతూ.. నేను మా తల్లిదండ్రుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి.. మా అమ్మ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఇప్పుడే నాకు తెలుస్తోంది. మా అమ్మ చాలా హార్డ్ వర్కర్.. ఇప్పుడు ఆ విషయం నాకు అర్థమవుతుంది.

ఉదయం 6:00 నుంచి సాయంత్రం 7:00 వరకు షూటింగ్స్ చేసి ఇంటికి వచ్చి.. తిరిగి మా బాధ్యతలను కూడా అమ్మే చూసుకుంటుంది.. ఎప్పుడూ మాకు టైం ఇవ్వలేదు అనే అవకాశం మాకు ఇవ్వకుండా మమ్మల్ని పెంచారు.ఇక నటనకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే నాన్న క్లియర్ చేస్తారు అంటూ తెలిపారు. అలాగే తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలపై రోషన్ మాట్లాడుతూ.. నా ఎదురుగా ఇద్దరు చాలా సంతోషంగా కనిపించేవారు. అయితే మీడియాలో వారిద్దరి డివోర్స్ వార్తలు చదువుతుంటే ఆశ్చర్యం అనిపించేది.

- Advertisement -

ఒకసారి అమ్మానాన్నని ఇదే విషయంపై ప్రశ్నించాను.. అయితే నాన్న.. మీడియాలో అలాగే రాస్తూ ఉంటారు.. అవేం పట్టించుకోవద్దు అని చెప్పారు. అంటూ తెలిపారు రోషన్. ఇకపోతే విడాకుల విషయాన్ని అడిగి వారిని కాస్త ఇరుకున పెట్టినా.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని రియలైజ్ అయ్యారు రోషన్ అని చెప్పవచ్చు.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు