Renu Desai: రేణు దేశాయ్ బర్త్డేకి అకీరా గిఫ్ట్ చూస్తే షాక్..!

ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన ఈమె.. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలతో ముంబైలో ఒంటరిగా జీవిస్తోంది. ఇక పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే మరొకవైపు సమాజంలో జరిగే విషయాలపై కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్. ఇదిలా ఉండగా ఇటీవల డిసెంబర్ 4వ తేదీన ఆమె తన పుట్టినరోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

అయితే తన కొడుకు అకీరా తాజాగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్..ఇకపోతే జానీ సినిమాలోని రేణు దేశాయ్ సన్నివేశాలను కొన్ని కట్ చేసి “సప్త సాగరాలు దాటి” సినిమాలోని పాటతో ఎడిట్ చేసి ఒక వీడియోని రూపొందించాడు అకీరా..ఇందులో పవన్ కళ్యాణ్ సన్నివేశాలు కూడా ఉండడం విశేషం. ఇక ఈ వీడియోని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..” నా బర్తడే కే నా కొడుకు ఇచ్చిన గిఫ్ట్” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త చాలా వైరల్ గా మారుతుంది. అంతేకాదు ఇది చూసిన చాలామంది అకీరా బాగా ఎడిట్ చేశాడని.. వీడియో కూడా చాలా బాగుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారని చెప్పాలి.

రేణు దేశాయ్ విషయానికి వస్తే.. ఇటీవల రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ రేణు దేశాయ్ పాత్రకు మాత్రం మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఇకపోతే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఈ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత మరో సినిమా ప్రకటించని ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు టీవీ షోలో కూడా కనిపిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు