Mrunal Thakur: అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్లు ఎక్కడా తగ్గట్లేదుగా!

టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఎక్కడా తగ్గట్లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో శ్రీ లీల తర్వాత బిజీ గా ఉన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. సీతారామం చిత్రం తో తెలుగులో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టడమే గాక అందులో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ ఇటు తెలుగులోనూ, అటు బాలీవుడ్ లోను వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే ఎన్ని ఆఫర్లు వచ్చినా అందులో మంచి సినిమాలనే సెలెక్ట్ చేసుకుని నెమ్మదిగా సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం తెలుగులో నాని30వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ తాజాగా విజయ్ దేవరకొండ మూవీ లోను హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక హిందీలో నాలుగు సినిమాల్లో నటిస్తూ అక్కడా తన హవా చూపిస్తుంది. ఇక సినిమాల్లోనే కాకుండా అటు ఫోటోషూట్లతోను ఈ అమ్మడు యూత్ ని ఆకర్షిస్తుంది. పలు కంపెనీల ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఫోటోషూట్లలో పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు వారానికో ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంటుంది మృణాల్ ఠాకూర్.

ఇక ప్రస్తుతం హిందీలో లస్ట్ స్టోరీస్ షూటింగ్ లో బిజీ గా ఉన్న మృణాల్ ఆ షూట్ అయిపోగానే త్వరలో నాని సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. ఈ లోపు విజయ్ దేవరకొండ తన ఖుషి సినిమా షూట్ అయిపోగానే మృణాల్ ఠాకూర్ తో కలిసి తన 13వ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు