NTR 30 : సమయం ఎప్పుడొస్తుందో..

ఎన్టీఆర్, ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉండే హీరో. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ తన శరీరాకృతితో చాలా ఇబ్బందులు పడ్డాడు. మంచి సినిమాలు వచ్చినా, ఫ్యాన్ బేస్ మాత్రం పెద్దగా రాలేదు. అలాంటి సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “టెంపర్” సినిమా వచ్చింది. ఈ సినిమా తారక్ కెరీర్ నే మార్చిసేంది. దీని తర్వాత వచ్చిన ప్రతి సినిమా బ్లక్ బస్టర్.

ఇక ఇటీవల టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. “ట్రిపుల్ ఆర్” తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. వరుసగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలకు సైన్ చేస్తూ వచ్చాడు. కొరటాల శివ కాంబినేషన్ లో NTR 30. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో NTR 31 సినిమాలు చేస్తున్నాడు. వీటి పై ఇప్పటికే అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి.

ఎన్టీఆర్ షెడ్యూల్ ప్రకారం, NTR 30 జులై నెలలో షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ, కొరటాల శివ స్క్రిప్ట్ పనులు పూర్తి కాకపోవడం, తారక్ ఫిజిక్‌ను మార్చే పనిలో ఉండటంతో వాయిదా పడింది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. కానీ, ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరింత లేట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -

NTR 30 కి సంబంధించిన స్క్రిప్టు ఫైనల్ డ్రాఫ్ట్‌ను ఇంకా లాక్ చేయాల్సి ఉందట. దీనికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మరో సారి వాయిదా పడనుందని తెలుస్తుంది. సెప్టెంబర్ లో గానీ, నవంబర్ లో గానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్.

షూటింగ్ వాయిదా పడిందనే వార్త ఇప్పుడు బయటకు రావడంతో డైరెక్టర్ కొరటాల పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. NTR30 లోని “అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించిన దమ్ము ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి. తను రావలసిన సమయం వచ్చిందని… వస్తున్న” అనే డైలాగ్ పై “NTR30 కి సమయం ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు వస్తడో ” అంటూ జోక్స్ పేలుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు