రామ్ చరణ్ తేజ్
చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిరు తనయుడు “మగధీర” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఎప్పుడు జరిగే రాజమౌళి సెంటిమెంట్ ఈయనను కూడా వెంటాడింది. మగధీర సినిమా తరువాత వచ్చిన “ఆరెంజ్” డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఆడియో మాత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్, ఒక సినిమాలో ఒక పాట బాగుండటం వేరు ఆల్బమ్ మొత్తం బాగుండటం వేరు సరిగ్గా ఆరెంజ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇక్కడ ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది, హరీష్ జైరాజ్ తెలుగులో చేసిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
మగధీర హిట్ తరువాత ఒక పర్ఫెక్ట్ హిట్ కోసం రామ్ చరణ్ గట్టిగా ప్రయత్నం చేసారు. కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి కానీ మగధీర స్థాయిలో ఏ సినిమా పడలేదు. రచ్చ సినిమా రిలీజ్ అయి మంచి పేరే వచ్చిన, చిరంజీవిని ఇమిటేట్ చేసాడు అనే విమర్శలనే ఎక్కువ ఎదర్కొన్నాడు రామ్ చరణ్.
చాలా ఏళ్ళ తరువాత చరణ్ కి రంగస్థలం సినిమా పడింది. ఆ తరువాత చరణ్ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎత్తిన ప్రతి నోటికి తన నటన తో సమాధానం చెప్పాడు. రంగస్థలం తరువాత ఆయన స్థాయి వేరు , ఆ స్థానం వేరు.
ఆ తరువాత వచ్చిన వినయ విధేయ రామ ఆశించిన రేంజ్ లో ఆడకపోయినా, చరణ్ కెరియర్ కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ తరువాత చరణ్ క్రేజ్ ఆకాశాన్ని అంటింది. అటువంటి చరణ్ “ఆచార్య”లో ఉన్నారంటే అంచనాలు ఊహకు మించి పెరిగిపోయాయి.
కానీ ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది ఆచార్య. మెగాస్టార్ పక్కన రామ్ చరణ్ ప్లస్ అయి, రాజమౌళి సెంటిమెంట్ కి చెక్ పెడతాడు అనుకుంటే, రామ్ చరణ్ కూడా ఆచార్యను కాపాడలేకపోయాడు అనేది అభిమానులకి, ఇటు డిస్ట్బ్యూటర్స్ కి షాక్ ఇచ్చిన విషయం.