Chiraneevi: మెహర్ రమేష్ పనితనం ఏంటో ఆరోజు తెలిసిపోతుంది

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందటే అనౌన్స్ అయిన ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి మెహర్ రమేష్ సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మెహర్ రమేష్ కి ఉన్న ప్లాప్ రికార్డుల కారణంగా ఏ టాలీవుడ్ హీరో తనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. కానీ మెగాస్టార్ దూరపు బంధువు కావడం వల్లో, చాలా రోజులుగా మెగా కాంపౌండ్ లో తిరగడం వల్లో చిరు రమేష్ కి ఛాన్స్ ఇచ్చాడు.

అయితే మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇచ్చినా కుడా చిరంజీవి ఈ సినిమా విషయంలో అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. పైగా ఈ సినిమా రీమేక్ కావడంతో స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చారు. అయినా సరే భోళా శంకర్ కోసం ప్రేక్షకులు పెద్దగా ఆలోచిస్తున్నట్టు లేరు. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన భోళా మానియా ఫస్ట్ సాంగ్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. మరి మెహర్ రమేష్ ఈ సినిమాను ఏ విషంగా మార్పులు చేసి తెరకెక్కించాడో అని మెగాభిమానులు కంగారు పడుతున్నారు.

అయితే ఈ భోళా శంకర్ టీజర్ ని జూన్24 రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. దర్శకుడిగా పదేళ్లు గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ ట్రెండ్ కి తగ్గట్టు అప్డేట్ అయ్యి భోళా శంకర్ ని ఏ విధంగా చూపించబోతున్నాడో అనేది టీజర్ ని చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పరంగా, సాంగ్ పరంగా ఏమంత ఆకట్టుకోలేకపోయిన భోళా శంకర్ టీజర్ ద్వారా ప్రేక్షకులని మెప్పిస్తే మెహర్ రమేష్ సగం సక్సెస్ అయినట్టే. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు