2018 : అల్లు అర్జున్ తో ఒక్క ఫోటో దిగితే చాలన్న మలయాళం స్టార్ యాక్టర్

పుష్ప సినిమాతో బన్నీ ఇండియా వైడ్ గా సెన్సేషన్ అయిన విషయం అందరికి తెలిసిందే, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2021 లో రిలీజై, ఇండియా వైడ్ మోస్ట్ పాపులర్ సినిమాగా నిలిచింది.

అయితే పుష్ప సినిమా ముందు సంగతి చూసుకుంటే అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో, మలయాళంలో కూడా అంతే క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ సినిమాలన్నీ తెలుగుతో పాటు, మలయాళంలో కూడా ఏకకాలంలో రిలీజ్ అవడం ఎప్పటినుంచే జరుగుతూ వస్తుంది. కేరళ బన్నీ సినిమాలకి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ గా పిల్లవాడే బన్నీని, మాలీవుడ్ లో అక్కడి ప్రేక్షకులు మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ ని మలయాళం ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారనేది అర్థమవుతుంది.

ఇక విషయానికొస్తే ఇటీవలనే 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో “2018” పేరుతో మలయాళంలో ఒక సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిలీజైన అతి తక్కువ సమయంలోనే 100కోట్ల కలెక్షన్స్ తో సంచలనాలను సృష్టిస్తుంది. అయితే ఈ సినిమా అదే పేరుతో జిఎ2 ప్రొడ్యూసర్ బన్నీ వాసు తెలుగులో రిలీజ్ చేసారు. మంచి సినిమాని ఎప్పుడు ఆధారించే తెలుగు ప్రేక్షకులు, 2018 సినిమాని కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రిలీజైన మొదటిరోజే 1.1cr తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగ హాజరైన, హీరో టోవినో థామస్ అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

- Advertisement -

ప్రొడ్యూసర్ బన్నీ వాసుని మీడియా వాళ్ళు అల్లు అర్జున్ ని సినిమా చూసాడా, ఆయనని ప్రమోషన్స్ కి పిలవాల్సిందని ప్రశ్నలు అడగగా బన్నీ వాసు తప్పకుండ ప్రయత్నిస్తాను అని సమాధానం చెప్పాడు. బన్నీ గురించి మాట్లాడగానే వెంటనే రియాక్ట్ అయిన హీరో టోవినో థామస్ “ఒకవేళ అల్లు అర్జున్ వస్తే నాకు చెప్పండి. నేను నా కూతురిని ఫంక్షన్ కి తీసుకొని వస్తా, నా కూతురు ఆయనకి పెద్ద ఫ్యాన్స్ అని చెప్పడంతో ప్రెస్ మీట్ ఆసక్తికరంగా మారింది.

ఆయన బన్నీ గురించి మాట్లాడుతూ ఆర్య సినిమా నుంచి ఆయన సినిమాలన్నీ తాను చూసినట్టుగా చెప్పాడు. మలయాళం ఆయనకి ఫ్యాన్ బేస్ చాలా ఉంది అంటూ చెప్పి, బన్నీ తో సినిమా చేస్తారా అని అడగగా “సినిమా పక్కన పెట్టండి, ఆయనని కలిసి ఒక్క ఫోటో దిగితే చాలు” అని చెప్పగా బన్నీ వాసు తప్పకుండ నేను బన్నీ, మీతో కలిసేలా ఏర్పాటు చేస్తాను అని ఆయనతో అన్నారు. దీన్నిబట్టి చూస్తే పుష్పరాజ్ క్రేజ్ మలయాళంలో ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు