Gunturu Karam : మహేష్ బాబుకి కావాల్సిన అసలు సిసలైన డైరెక్టర్ ఇతనే !

కొన్ని కాంబినేషన్ లకు టాలీవుడ్ లో సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఇండస్ట్రీలో మరియు బయట చాలా మంది ఫలానా ఆ కాంబినేషన్ లో సినిమా రావాలి, ఫలానా ఈ కాంబినేషన్ లో సినిమా రావాలి అని కోరుకుంటుంటారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఆ కాంబినేషన్ లో గనక సినిమా పడితే ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహం వేరే లెవెల్ లో ఉంటుంది.

అయితే ఇలాంటి డ్రీం కాంబినేషన్స్ ప్రతి డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి, హీరోకి ఉంటాయి. అలాగే అభిమానుల్లో కూడా ఉంటాయి. కానీ ఈ డ్రీం కాంబినేషన్స్ ఎప్పటికి సెట్స్ పైకి వెళ్తాయనేది ఎవరి చేతుల్లో ఉండదు. అందరి హీరోల అభిమానులకి ఇలాంటి డ్రీం కాంబినేషన్ లు ఉన్నట్టే మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అని చెప్పొచ్చు.

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే తాను ఏంటో నిరూపించుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ కి మంచి ఉదాహరణగా నిలిచింది. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు. హిందీలో కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా తరువాత తెలుగులో సినిమా ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ.కానీ పలు కారణాల ఇక్కడ సినిమా చేయడం కుదరలేదు.

- Advertisement -

ప్రస్తుతం ఈయన రణ్ బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్, ఆ మధ్య సందీప్ రెడ్డి వంగ మహేష్ తో సినిమా చేస్తా అని చెప్పినప్పటి నుంచి ఈ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు, రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలలో మహేష్ చుసిన ఫ్యాన్స్ ఒక ఒరిజినల్ కంటెంట్ బేస్డ్ యాక్షన్ సినిమాలో చూడాలని ఎప్పటి నుంచో ఉండగా, సందీప్ రెడ్డి సినిమాతో ఆ కల నెరవేరబోతోందని హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమాలు ఎనౌన్స్ చేసేసిన సందీప్ రెడ్డి వంగ, మరి ముందుగా ఏ సినిమా స్టార్ట్ చేస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు