Mahesh Babu: ఈ సినిమా గురించి సుప్రీం కోర్టులో కూడా మాట్లాడారు

“పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

తాత్పర్యము:
కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.

ఈ అనుభవం చాలామంది సినిమావాళ్ళకి, చాలాసార్లు ఎదురవుతుంది.
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి అలాంటి అనుభవమే మరోసారి ఎదురైంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రీసెంట్ ఫిలిం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది.

- Advertisement -

“సర్కారు వారి పాట” సక్సెస్‌ అయిన సంధర్బంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ స్పందించారు. ఈ సినిమా గురించి ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు.

‘మహేశ్‌ సర్కారు వారి పాట చాలా బాగుంది. ఫస్ట్‌ హాప్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. సెకండ్‌ హాఫ్‌లో మహేశ్‌ పర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. ఈ మూవీ కలేక్షన్స్‌ అన్ని సెంటర్స్‌లోనూ
హౌస్ ఫుల్‌తో పోతుంది. అయితే కొన్ని చానల్స్‌ మాత్రం మూవీ బాగాలేదని ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. ఈ సినిమాలో మహేశ్‌ పోకిరి కంటే కూడా చాలా యంగ్‌ కనిపిస్తున్నాడంటూ కృష్ణ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇక సర్కారు వారి పాట సినిమా గురించి సుప్రీం కోర్టులో మాట్లాడాలని, అంత మంచి కథ తీసుకున్నారని చెప్పారు. అయితే సర్కారు వారి పాట మూవీ ఇంట్లోనే తన హోం థియేటర్లో చూశానని, సినిమా చూడగానే మహేశ్‌కు ఫోన్‌ చేశానన్నారు. చాలా బాగా నటించావని, పోకిరి, దూకుడు కంటే కూడా సర్కారు వారి పాట పెద్ద హిట్‌ అవుతుందని చెప్పడంతో వాడు చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు