మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ థియేటర్లలో సందడి చేస్తుంది. మహేష్ బాబు అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని చూడ్డానికి ఎగబడుతున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’ వారు నిర్మాతలు. అయితే తొలి రోజు ఈ మూవీ పై మిక్స్డ్ టాక్ నమోదైంది. కొన్ని సీన్లు లాజిక్ లెస్ గా రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాల పై దర్శకుడు పరశురామ్ స్పందించాడు.
ఈ చిత్రంలో హీరో.. 10 వేల డాలర్లతో పాటు 25వేల డాలర్లు కూడా అప్పుగా ఇస్తాడు. కానీ 10వేల డాలర్లే తిరిగి ఇవ్వమని అడుగుతాడు? ఈ విషయం పై చాలా విమర్శలు వచ్చాయి. దీనికి పరశురామ్ స్పందిస్తూ… “హీరో, హీరోయిన్ కి ఇచ్చిన అప్పు పదివేల డాలర్లే. మిగతా పదిహేను వేల డాలర్లు ప్రేమలో వున్నపుడు ఇస్తాడు.వెన్నెల కిషోర్ తో కూడా పెళ్ళాం ఖర్చుపెట్టినవి ఎక్కడ ఖర్చుపెట్టావ్, ఎందుకు ఖర్చుపెట్టావ్ అని అడిగి ఇబ్బంది పెట్టే రకం కాదు అని కూడా మహేష్ ఓ డైలాగ్ చెబుతాడు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.
అలాగే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పై హీరో కాలు వేసి పడుకునే సీన్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. అది వల్గర్ గా ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి.దీనికి పరశురామ్ స్పందిస్తూ.. “ఆ సీన్స్ లో ఎక్కడా వల్గారిటీ లేదు. అలాంటి వల్గారిటీ వుంటే మహేష్ గారే వద్దని చెప్తారు. తల్లి దగ్గర నిద్రపోయే ఒక బిడ్డలా ఆ సీన్స్ ఉంటాయి తప్పితే అందులో వల్గారిటీ లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.