Like, Share & Subscribe: యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌ తో

వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మేర్లపాక గాంధీ. ఆ తరువాత చేసిన ఎక్సప్రెస్ రాజా సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది, కానీ నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా మాత్రం ఆశించిన ఆడలేదు. ఆ తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ మరియు హీరో సంతోష్ శోభన్ కలిసి ఏక్ మినీ కథ అనే చిత్రానికి పనిచేశారు. లాక్‌డౌన్ సమయంలో ఈ చిత్రం నేరుగా OTT  లో  విడుదల అయింది. ఇప్పుడు వీరిద్దరూ మరో వినోదాత్మక చిత్రంతో రాబోతున్నారు లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ అనే టైటిల్‌తో చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను లాంచ్ చేసింది.

టీజర్‌లో యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌ తో పాటు యూత్ ను ఆకర్షించే అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. టీజర్ లో సంతోష్ శోభన్‌ను ట్రావెల్ వ్లాగర్‌గా కనిపిస్తున్నాడు. ఒక ట్రావెల్ లో సంతోష్ ఫరియా అబ్దుల్లాను కలవడం. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమకథను ఈ సినిమాలో చూపించనున్నట్లు అర్ధమవుతుంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు