Tollywood: లెజెండరీ హీరోతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నలారెన్స్

రాఘవ లారెన్స్ హీరోగా, క‌దిరేశ‌న్ దర్శకత్వంలో నటించిన చిత్రం రుద్రన్. ఈ సినిమా తెలుగులో “రుద్రుడు” అనే పేరుతో ఏప్రిల్ 14 న విడుదలయి మంచి రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు సాధిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ఈవెంట్ కొన్ని రోజుల క్రితం జరగగా ఆ ఈవెంట్ లో లారెన్స్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్ లో రాఘవ లారెన్స్ పని చేసిన కొంత మంది నటులను చూపి వాళ్ళ గురించి అభిప్రాయాన్ని చెప్పామన్నారు.

అందులో నాగార్జున, jr ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లతో ఉన్న ఫోటోలను ప్లే చేశారు. అలాగే ఒక లెజెండరీ యాక్టర్ ఫోటో వేశారు. ఆయన గురించి ఫోటో వేయగానే ఆ ఈవెంట్ మొత్తం ఈలలు, కేకలతో హోరెత్తింది. ఆ పిక్ లో ఉన్నది ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరు తో లారెన్స్ కి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. తెలుగు లో చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమా ద్వారానే రాఘవ లారెన్స్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత హిట్లర్ లో లారెన్స్ కోరియోగ్రఫీ చేసిన అబిబి అబిబి సాంగ్ తో స్టార్ కొరియోగ్రాఫర్ గా మారాడు. తర్వాత ఇంద్ర, ఠాగూర్, అందరివాడు లాంటి ఎన్నో సినీమాల్లో చిరు పాటలకి కొరియోగ్రాఫర్ గా చేసాడు.

అయితే ముఠామేస్త్రి సినిమా లో టైటిల్ సాంగ్ లో ఎక్కడో 5వ రోల్ లో ఉన్న తనని గుర్తించి ప్రభుదేవా తో మాట్లాడి నెక్స్ట్ మూవీ లో కొరియోగ్రాఫర్ ని చేశాడు. అన్నయ్య చిరంజీవి లేకపోతే నేను లేను అని రాఘవ లారెన్స్ చిరుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 లో కూడా లారెన్స్ తోనే ఫస్ట్ సాంగ్ చేయించుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు