L. Vijayalakshmi : పుష్ప హీరో తెలియదు

అలనాటి నటి, నర్తకి ఎల్ విజయలక్ష్మి గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు. 1950, 60 దశకాలలో అప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది విజయలక్ష్మి. అకౌంటింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలోని వర్జినియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా పనిచేస్తుంది. చాలా ఏళ్ల తర్వాత తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ శతజయంతి వారోత్సవాల సందర్భంగా ఆమెకి ఎన్టీఆర్ జాతీయ అవార్డుని ప్రకటించడంతో ఆ అవార్డుని అందుకోవడానికి అమెరికా నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఇక్కడే ఉండడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆలీతో ఒక ఇంటర్వ్యూకి ఈమె వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య ఏదైనా సినిమా చూశారా? అన్న ప్రశ్నకు పుష్ప సినిమా చూశానని చెప్పింది.

అందులో నటించిన హీరో ఎవరో తెలుసుగా అనే లోపే తనకు తెలియదని చెప్పింది. అల్లు రామలింగయ్య గారి మనవడు అని అలీ చెప్పగా.. అవునా అంటూ ఆశ్చర్యపోయింది. ఇటీవల ఏ హీరో గురించి అడిగినా ఇలాగే చెబుతున్నారని.. నాగేశ్వరరావు గారి మనవడు, రామానాయుడు గారి మనవడు అంటున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు