Kriti Sanon: ఇష్టమైన తెలుగు సినిమాలు ఇవే

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “1 నేనొక్కడినే “. ఈ సినిమాతోనే అటు ఇండస్ట్రీ ఎంట్రీ.. ఇటు టాలీవుడ్ ఎంట్రీ రెండు ఒకేసారి ఇచ్చింది కృతీ సనన్. ఆ తర్వాత నాగచైతన్య దోచేయ్ చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో కృతీ సనన్ కి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కృతి సనన్ తాజాగా బాలీవుడ్ లో నటించిన చిత్రం “భేదియా”. ఈ సినిమాని తెలుగులో తోడేలు పేరుతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ మూవీ టీం హైదరాబాదులో సందడి చేసింది. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. తన ఫేవరెట్ తెలుగు సినిమాలు ఏవో చెప్పుకొచ్చింది. అవేంటంటే.. ” అల్లు అర్జున్ పుష్ప, ఎన్టీఆర్ – రామ్ చరణ్ RRR”. ఈ రెండు చిత్రాలు బాగా నచ్చాయట. ఇక తెలుగులో తనకు బాగా నచ్చిన హీరో ప్రభాస్ అని చెప్పుకొచ్చింది. మరోవైపు ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రలో కృతి నటించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు