Kriti Sanon: డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన కృతిసనన్..!

Kriti Sanon

AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాటే వినిపిస్తోంది. రాబోయే రోజులలో ఈ ఏ ఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించడం ఖాయం అని చెప్పడంలో సందేహం లేదు. అయితే సమాజానికి మేలు చేస్తున్న ఈ టెక్నాలజీ కారణంగా కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి ..ఇటీవల వెలుగులోకి వచ్చిన డీప్ ఫేక్ వీడియోలే అందుకు నిదర్శనం .. దీని వల్ల సెలబ్రిటీలు ఎంతలా ఇబ్బందులకు గురి అయ్యారో అందరికీ తెలిసిందే. చాలా మంది స్టార్ సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ ను కూడా ఆశ్రయించారు.. అంతేకాదు ఈ విషయంపై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో.. అంతే దుర్వినియోగం చెందుతుందని కూడా చెప్పవచ్చు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ విషయంపై ప్రముఖ అందాల తార కృతి సనన్ కూడా స్పందించింది. డీప్ ఫేక్ వీడియో గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ సంచలనం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా చిత్రంతో ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో డీప్ ఫేక్ గురించి మాట్లాడింది. ఇదే ఈ విషయంపై కృతి సనం మాట్లాడుతూ .. డీప్ ఫేక్ విషయంలో టెక్నాలజీని నిందించడం తప్పు అని అభిప్రాయపడ్డ కృతి సనన్ ..దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సృష్టించింది కూడా మనుషులే కదా.. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి..

టెక్నాలజీ అభివృద్ధి చూస్తుంటే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ.. ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది.. కానీ దానిని మనుషులే దుర్వినియోగం చేస్తున్నారు అంటూ మండిపడింది. మనుషులే సృష్టించిన ఈ టెక్నాలజీని మనుషులే తప్పుదోవ పట్టిస్తుంటే.. టెక్నాలజీని నిందించడం తప్పు అంటూ తన అభిప్రాయంగా వెల్లడించింది.. ఇకపోతే ప్రస్తుతం కృతి సనన్ నటిస్తున్న తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా చిత్రం ఏ ఐ టెక్నాలజీతోనే తెరకెక్కబోతోంది. ఇందులో కృతి సనన్ సిఫ్రా అనే రోబో పాత్రలో కనిపించనుంది. ఇందులో భూమి పడ్నేకర్ కూడా మరో హీరోయిన్ G నటిస్తోంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు