Naga Shaurya : ఇంకా విడుదల కాలేదా ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అంటే పరిచయం అవసరం లేని పేరు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. 2011లో ఇండస్ట్రీకి వచ్చిన నాగ శౌర్య దాదాపు 20కి పైగా సినిమాలు చేశాడు. వీటిలో చెప్పుకొదగ్గ సినిమా అంటే ఛలో ఒకటి మాత్రమే. ఛలో లాంటి హిట్ సినిమా నాగ శౌర్య కెరీర్ లో మళ్లీ రాలేదు. ఈ యంగ్ హీరో గతేడాది డిసెంబర్ లో లక్ష్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఎప్పటి లాగే, నాగ శౌర్యను నిరాశ పరిచింది.

ఈ యంగ్ హీరో ఇటీవల కృష్ణ వ్రింద విహారి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వం వహించాడు. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మించారు. అలాగే షిర్లే సెటియా హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ చిత్రం ఏడాది జూన్ లోనే విడుదల కావాల్సింది. నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికీ సినిమాతో పాటు కృష్ణ వ్రింద విహారి విడుదల కావాలి. కానీ, జూన్, జులైలో ఎక్కువ సినిమాలు విడుదల అయ్యాయి. దీంతో పోటీని తట్టుకోవడం కష్టమేనని భావించిన మేకర్స్ వాయిదా వేసుకుంటూ వచ్చారు.

తాజాగా ఈ సినిమా నుంచి అప్ డేట్ వచ్చింది. కృష్ణ వ్రింద విహారిని సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ వార్త బయటకు రావడంతో నెటిజన్లు ఈ సినిమాపై సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదా.. చాలా రోజుల క్రితమే విడుదల అయింది అనుకున్నామంటు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా.. అంటే సుందరానికీ, జయమ్మ పంచాయతి, అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలతో విడుదల కావాల్సింది. ఈ సినిమాలు విడుదల అయ్యాయి. ఆ హీరోలు మరో సినిమాల పనులు చేసుకుంటున్నారు. కానీ నాగ శౌర్య మాత్రం.. ఇంకా కృష్ణ వ్రింద విహారి వద్దే ఉన్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు