Bhola shankar: కీర్తి సురేష్ అతనికి తప్ప ఇంకెవ్వరికీ లిప్ కిస్ ఇవ్వదట.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల దసరా బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ మీదుంది కీర్తి సురేష్. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలలో నటించి తన నటనతో నేషనల్ అవార్డు కూడా కైవసం చేసుకుంది.

అయితే ఈ మహానటి ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతకాలం అవుతున్న సరే ఏనాడు హద్దులు దాటలేదు. తన కెరీర్ లో లిప్ లాక్ లకు, బికినీలకు మొదటి నుంచి దూరంగానే ఉంది. అలాంటి సన్నివేశాలు ఉంటే ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఎన్ని కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినా తాను నియమించుకున్న కొన్ని నిబంధనలు మాత్రం తూచా తప్పకుండా ఫాలో అవుతాను అంటుంది కీర్తి సురేష్. సర్కారు వారి పాట సినిమాలో కాస్త బోల్డ్ లుక్స్ లో కనిపించినప్పటికీ.. ఆ ఒక్కటి మాత్రం చేయనంటుంది. అదే లిప్ లాక్. తన భర్తతో తప్ప వేరే ఏ హీరోతోను అది చేయనని క్లారిటీ ఇస్తుంది.

క్యారెక్టర్ ఎంత డిమాండ్ చేసిన లిప్ లాక్ కి ఒప్పుకోదట. ఇటీవల కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ కథ డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్ ని లిప్ లాక్ సన్నివేశంలో నటించమని అడిగారట. దీనికి తాను చేయనంటూ తెగేసి చెప్పిందట. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం కీర్తి భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతీ స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు