Mega power star: రామ్ చరణ్ కంటే ఉపాసనే ధనవంతురాలా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఎట్టకేలకు పేరెంట్స్ గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. 2012లో రామ్ చరణ్ ఉపాసనని వివాహం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఇదే సమయంలో రామ్ చరణ్ – ఉపాసనకు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన కి కూడా ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఉంది. తన ఇంస్టాగ్రామ్ పోస్టులతో అలరించడమే కాకుండా అపోలో హాస్పిటల్స్ పనులు చూసుకోవడంలో అలానే మరికొన్ని తన సొంత బిజినెస్ లలో బిజీగా ఉంటుంది ఉపాసన.

చరణ్ – ఉపాసనల ఆస్తి విలువ రూ. 2500 కోట్లు. ఇందులో ఉపాసన ఆస్తి రూ.1130 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉపాసన, బిజినెస్ మ్యాన్ టైకూన్ సి ప్రతాపరెడ్డి మనవరాలు. ఆయన అపోలో ఆసుపత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన నికర ఆస్తుల విలువ ఏకంగా రూ.21,000 కోట్లు ఉంటుందని సమాచారం. ఇతను భారత దేశంలో ఉన్న టాప్ 100 రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరు.

- Advertisement -

ప్రస్తుతం ప్రతాపరెడ్డి అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ. 70,000 కోట్లుగా ఉంది. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఉపాసన ఫారెన్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో డిగ్రీ తీసుకుంది. చదువు పూర్తయిన వెంటనే బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయింది.

ఇక ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కు ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తుంది. ఇంత సంపద ఉన్నా ఉపాసన చాలా నిరాడంబరంగా ఉంటారు. బంధాలకు చాలా విలువ ఇస్తారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ అంటే అమితమైన గౌరవం కనబరుస్తారు. ఇక మెగా అభిమానులు ఆమె ప్రవర్తనను చాలా ఇష్టపడతారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆమెని వదినమ్మ అని పిలుచుకుంటారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు