Mega star: చిరంజీవి రీమేక్ సినిమాలపై యంగ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ అంత అసంతృత్తిగా ఉన్నారనేది వాస్తవం. దీనికి కారణం ఆయన రీమేక్ సినిమాలకి ఒకే చెప్పడమే. ఈ రోజుల్లో చాలావరకు ఓటిటీల వినియోగం పెరిగిన కారణంగా దాదాపుగా అందరు అన్ని రకాల భాషల సినిమాలని ఓటిటీలలోనే చూసేస్తున్నారు. మరీ ఇటువంటి పరిస్థితులలో ఇతర భాషల సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం వల్ల ఉపయోగం ఏముందని అందరి అనుకుంటున్నారు.

ఇక చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇదే వైఖరి చూపించడం ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చట్లేదు. ఇప్పటికే ఆయన తెలుగులో ఆల్రెడీ డబ్ అయిన కత్తి, లూసిఫర్ సినిమాలను ఖైదీ నంబర్ 150, గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేయగా, ప్రస్తుతం ఆయన మరో తమిళ్ సినిమా అయిన వేదాళం సినిమాని భోళా శంకర్ పేరుతో తెలుగులో రీమేక్ లో చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇక ఈ సినిమాతోనైన మెగా స్టార్ రీమేక్ సినిమాలకు బ్రేక్ ఇస్తాడేమో అనుకుంటే ఇటీవలనే మళ్ళీ ఇంకో రీమేక్ సినిమాకి బాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో పాలుపోవట్లేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చేయబోయే సినిమా మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన బ్రో డాడీ సినిమా రీమేక్ అని అందరికి తెలిసిందే.

ఇక ఇదే విషయాన్ని ప్రముఖ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇటీవల ఒక ఇంటర్యూలో ప్రస్తావిస్తూ.. ఇన్ డైరెక్ట్ గా ఈ విషయంపై కామెంట్ చేసారు. ఆయనకి చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాలు తనకి చాలా ఇష్టమని చెబుతూ అలాగే ఆయనకి రుద్రవీణ సినిమా కూడా ఫేవరెట్ అని ఆయన గనక చిరంజీవితో సినిమా తీస్తే ఖచ్చితంగా చిరంజీవిలో ఉన్న నటుడిని, స్టార్డం ని బాలన్స్ చేసేలా తీస్తానని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు