Upasana : రామ్ చరణ్ కూతురుకు ఆ స్టార్ హీరోయిన్ పేరు ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా కోడలు ఉపాసన ఇటీవలనే తల్లిదండ్రులు అయిన సంగతి అందరికి తెలిసిందే. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో… మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం రోజున రాత్రి ఒంటిగంట 40 నిమిషాలకు… మెగా ప్రిన్సెస్ జన్మించిందని మెగాస్టార్ చిరంజీవి అధికారిక ప్రకటన చేశారు.

దీంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనలకు పుట్టిన బిడ్డ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసన- రామ్ చరణ్ కూతురికి… ఓ స్టార్ హీరోయిన్ పేరు పెడుతున్నారట. రామ్ చరణ్ కు అలనాటి హీరోయిన్ అంజలీదేవి అంటే బాగా ఇష్టమట. అలాగే చిరంజీవి తల్లి, రామ్ చరణ్ నానమ్మ పేరు కూడా అంజనాదేవి.

ఈ అంజలి అనే పేరు రామ్ చరణ్ కు బాగా కలిసి వచ్చిందట. అందుకే తన కూతురు పేరు అంజలీ దేవి అని పెట్టేందుకు రాంచరణ్ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. కాగా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనల కూతురు జాతకం చాలా బాగుందని ఇప్పటికే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్సెస్… పుట్టుకతో మెగా ఫ్యామిలీ లో మంచి జరుగుతుందని ఆయన వివరించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కంటే మెగా ప్రిన్సెస్… చాలా మంచి పేరు తెచ్చుకుంటుందని వేణు స్వామి చెప్పారు

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు