Katrina Kaif : అప్పుడే ఫిక్స్ అయ్యా..

బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో ఎంత ఫేమస్ అయిందో  అందరికీ  తెలిసిందే. చాలా మంది నటీనటులు వారి వారి సినిమా ప్రమోషన్ల కోసం ఈ షోకి హాజరవుతున్నారు. హోస్ట్ గా ఉన్న కరణ్ జోహర్ వేస్తున్న ప్రశ్నలు కొంత వరకు చిరాకుగా ఉన్నా ప్రేక్షకులు ఈ షోపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు సినిమా ప్రమోషన్ల కోసం ఈ షోలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఈ షోకు బాలీవుడ్ ముద్ధుగుమ్మ కత్రినా కైఫ్ కూడా వెళ్లారు. 

ఈ షోలో ఈమె విక్కీ కౌశల్ ను ఎలా కలుసుకుందో వివరించింది. జోయా అక్తర్ ఇంట్లో జరిగిన ఈ శుభకార్యంలో తాను విక్కీ కలిసుకున్నట్లు తెలిపింది. తనను, విక్కీ కౌశల్ ను విధి కలిపిందంటూ చెప్పుకొచ్చింది. విక్కీతో ప్రేమలో పడకముందు, అతని గురించి ఏమీ తెలియదని, అందువల్లే తమను విధి కలిపిందని నమ్ముతున్నట్లు వెల్లడించింది. 

జోయా అక్తర్ పార్టీలో విక్కి ని చూసినప్పుడు మాట్లాడాను. అప్పుడే ఫిక్స్ అయ్యా.. అతను నావాడే అని. అలా కలుసుకున్నాం. ప్రేమలో పడ్డాం. తర్వాత కొంత కాలం డేటింగ్ లో ఉన్నాం. విక్కీ తన ఫ్యామిలీని ఎంతో గౌరవిస్తాడు. అలాగే నా ఫ్యామిలీపై కూడా అంతే గౌరవం చూపిస్తాడు. పెళ్లి తర్వాత నా ఫస్ట్ బర్త్ డే ను మాల్దీవుల్లో జరుపుకున్నాం. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాం” అంటూ కత్రినా చెప్పుకొచ్చింది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు