Brahmastra : తొలిరోజే !

బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ చిత్రం బ్రహ్మస్త్ర. ఒకపక్క భారీ అంచనాలు, మరో పక్క బాయ్ కాట్ విమర్శల మధ్య ఈ చిత్రం ఈ నెల 9న పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా విడుదల అయింది. పురాణాల్లో ఉండే అస్త్రాలను, వాటిని ఉపయోగించే సూపర్ హీరోల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన  ట్రైలర్, పాటలు అంచనాలను భారీగా పెంచాయి. దీంతో ఈ చిత్రం తొలి రోజు వసూళ్ల పరంగా రికార్డులు నమోదు చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ముఖ్యంగా  ఈ చిత్రం టాలీవుడ్ లో పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రమోషన్లు కూడా తెలుగు భారీ స్థాయిలో చేశారు. తెలుగు అగ్ర నటీ నటులను ప్రమోషన్ల కోసం ఉపయోగించుకున్నారు. ఇలాంటి సందర్భంలో బ్రహ్మస్త్రకు భారీ షాక్ తగిలింది. వినాయక నిమజ్జనం సందర్భంగా వస్తున్న ఈ చిత్రానికి వినాయక నిమజ్జమే నష్టాలను తెచ్చిపెడుతుంది. 

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దీని వల్ల చాలా థియేటర్లు మూతపడే అవకాశం ఉంది. దీంతో వందల షోలు రద్దు కానున్నాయి. అప్పుడు బ్రహ్మస్త్ర ఓపెనింగ్ కలెక్షన్ల పై భారీ ప్రభావం చూపనుంది. ఇది బ్రహ్మస్త్ర చిత్ర యూనిట్ కు భారీ షాక్ అని చెప్పొచ్చు. కాగా బ్రహ్మస్త్ర ప్రపంచ వ్యాప్తంగా 8000 స్క్రీన్లు, ఇండియాలో 5000 స్క్రీన్లు , ఓవర్సీస్ లో 3000 స్క్రీన్  లలో విడుదలవుతోంది. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు