Sardar : క్రేజీ అప్డేట్

తమిళ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.ఎస్.మిత్ర తెరకెక్కిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ చిత్రంగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ‘సర్దార్’ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

సర్దార్ చిత్రానికి లెంగ్త్ రన్ టైం ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఏకంగా రెండు గంటల 45 నిమిషాల టైంను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా సర్దార్ మూవీ యూనిట్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటన చేసింది.

సర్దార్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు దాస్ పల్ల కన్వెన్షన్ ఫస్ట్ ఫ్లోర్ మాదాపూర్, హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే సర్దార్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రం అక్టోబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు