Karthikeya-2: ఓటిటిలో ప్రభంజనం

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో ‘కార్తికేయ 2’ కూడా ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. నిఖిల్ సినీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా.

ఆగష్టు 13న థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన కార్తికేయ 2.బాక్సాఫీస్ వద్ద భీభత్సమైన ప్రాఫిట్స్ రాబట్టడం విశేషం. కృష్ణతత్వం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన కార్తికేయ 2 సినిమాకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

రీసెంట్ గా జీ 5 ఓటిటి లో రిలీజైన కార్తికేయ-2 చిత్రం కేవలం 48 గంటల్లో 100 కోట్లు పైగా నిమిషాల స్ట్రీమింగ్ అయి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్నీ జీ5 సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మాములుగా థియేటర్స్ లోనే ప్రభంజనం చూపించడం కాకుండా ఓటిటి లో అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు