Kalki: అంచనాలను అందుకుంటే, మునుపెన్నడూ చూడని కలెక్షన్స్

Kalki 2898Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇది ఒకప్పటి పేరు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా, ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పే సినిమా అంటే బాహుబలి అని చెప్పొచ్చు. అప్పటివరకు తెలుగులో ఏ హీరో కూడా ఒక సినిమా కోసం వెచ్చించని సమయాన్ని బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కేటాయించాడు. ఆ సినిమాకి కేటాయించిన టైం ప్రభాస్ జీవితాన్నే మార్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది అని చెప్పడంలో అసలు తప్పులేదు.

బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమాలలో సలార్ మినహా ఏ సినిమా ఆకట్టుకోలేదు. కానీ ఆ సినిమాలకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా వచ్చాయి. అసలు ప్రభాస్ బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు అన్ని కోట్లు ఒక ప్రాజెక్టుకి ఖర్చు పెట్టడం ఎందుకు.? ప్రభాస్ కి అంత మార్కెట్ ఉందా.? అంటూ చాలామంది రకరకాలుగా కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కేవలం ప్రభాస్ రేంజ్ కాదు, తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమాల కోసం ఇతర భాషల్లో వెయిట్ చేసే ఆడియన్స్ మొదలయ్యారు. అంతటి ఘనవిజయాన్ని సాధించింది బాహుబలి.

ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి, మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. దానికంటే ముందు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా విడుదలవుతుంది. అయితే కల్కి సినిమా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి పెట్టనటువంటి భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు.

- Advertisement -

ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, దాదాపుగా అదే సినిమాకు పోటీగా కనీసం రెండు మూడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉంటాయి. కానీ ప్రభాస్ కి ఒక అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పెద్దగా స్టార్ హీరోలు ఫిలిమ్స్ ఏవి పోటీగా రాలేదు. అలానే సమ్మర్లో రాబోతున్న కల్కి సినిమాకి కూడా ఇప్పుడు పోటీ లేదు. అంచనాలను కల్కి సినిమా నిలబెట్టుకుంటే తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని కలెక్షన్స్ ను ఆ సినిమా రాబట్టగలదు. అని చాలామంది సినీ ప్రముఖులు నమ్మకం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు