Kajal Agarwal : చంద్ర‌ముఖి

త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో చంద్ర‌ముఖి -2 చిత్రం రూపొందుతున్న విష‌యం విధిత‌మే. ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైన‌ట్టు స‌మాచారం. రాఘ‌వ లారెన్స్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. తాజా స‌మాచారం మేర‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ చిత్రంలో చంద్ర‌ముఖి పాత్ర వేస్తుంద‌ని తెలుస్తోంది.

తొలుత ఎవ‌రెవ‌రినో అనుకున్న ద‌ర్శ‌కుడు వాసు, రాఘ‌వ లారెన్స్ ఇద్ద‌రూ కాజ‌ల్ అయితే చాలా బాగుంటుంద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఆ త‌రువాత ఆమెకి క‌థ చెప్ప‌డంతో ఆమె కూడా ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. కాజ‌ల్ సినీ కెరీర్లోనే ఇది ఓ మంచి పాత్ర అవుతోంద‌ని చిత్ర బృందం భావించింది. చంద్ర‌ముఖి పార్ట్-1లో ర‌జినీకాంత్, జ్యోతిక‌, న‌య‌న‌తార వేసిన విష‌యం తెలిసిందే. పి.వాసు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఇప్పుడు తీస్తున్న పార్ట్‌-2 దానికి సీక్వెల్‌గానే ఉంటుంది. కేవ‌లం చంద్ర‌ముఖి పాత్ర‌ని మాత్ర‌మే తీసుకున్నారు. అందులో న‌టించే న‌టీన‌టుల‌ను మాత్రం తీసుకోవ‌డం లేదు. చంద్ర‌ముఖి పాత్ర ద్వారా ఓ కొత్త క‌థ‌ను ఎంచుకున్న‌ట్టు స‌మాచారం.

జ్యోతిక‌కి మంచి పేరు తీసుకొచ్చిన చంద్ర‌ముఖి ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి కూడా అంత‌క‌న్నా మంచి పేరు తీసుకొస్తుంద‌ని చిత్ర యూనిట్ అభిప్రాయ‌ప‌డింది. కాజ‌ల్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఇండియ‌న్ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌తో చేస్తోంది. చంద్ర‌ముఖి సెట్స్‌లోకి త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు స‌మాచారం. కాజ‌ల్ కూతురు పుట్టిన త‌రువాత ఒప్పుకున్న చిత్రం కావ‌డం విశేషం. మిగ‌తా సినిమాల‌న్నికూడా అంత‌కు ముందు ఒప్పుకున్న‌వే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు