Sudheer : ‘పాపతో పైలం’

నైట్రో స్టార్ సుధీర్ బాబుకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయి.. ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు సుధీర్ బాబు.

ఇటీవల విడుదలైన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం హీరో సుధీర్ బాబు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం “ది హంట్”. థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీకి “గన్స్ డోంట్ లై” అనేది ట్యాగ్ లైన్.ఈ సినిమా ద్వారా యువ దర్శకుడు మహేష్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. సుధీర్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.

ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుండి ” పాపతో పైలం” అనే మాస్ ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. సుధీర్ బాబుతోపాటు అప్సర రాణిి నటించిన ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించారు. మాస్ బీట్ లో సాగుతున్న ఈ పాటకి ప్రస్తుతం మంచి క్రేజ్ కొనసాగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు