Viraj Ashwin: ‘జోరుగా హుషారుగా’ టీజర్.. ఫిల్మ్ ఆ? షార్ట్ ఫిల్మ్ ఆ?

టాలీవుడ్ లో ఈ మధ్య చిన్న సినిమాల హవా ఎక్కువైందని తెలిసిందే. కథ బాగుంటే చాలు హీరో ఎవరని కూడా పట్టించుకోకుండా హిట్ చేస్తారు ఆడియన్స్. అయితే ఈ క్రమంలో ఎలా పడితే అలా కంటెంట్ లేని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వారంలో అరడజను సినిమాలొస్తే అందులో ఒక్కటి హిట్ కావడమే కష్టంగా ఉంది. అయినా కూడా చిన్న దర్శకులు తమ సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

తాజాగా అలాంటి ప్రయత్నంలో ఓ చిన్న సినిమా రాబోతుంది. ఆ సినిమాయే “జోరుగా హుషారుగా”. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా కామెడీ, లవ్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కగా, తెలుగుఅమ్మాయిలైన పూజిత పొన్నాడ, సిరి హన్మంత్ హీరోయిన్లుగా నటించారు. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ కాగా, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ క్వాలిటీ విషయంలో మెప్పించలేకపోయింది.

ఈ సినిమా టీజర్ ని గమనిస్తే అన్ని సినిమాల్లో ఉన్న కామన్ పాయింటే ఈ సినిమాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక సాఫ్ట్వెర్ హీరో, ఈజీ గా పడిపోయే హీరోయిన్, కష్టాల్లో మోటివేట్ చేసే తల్లిదండ్రులు, కామెడీ చేసే ఫ్రెండ్స్.
అయితే ఈ టీజర్ కి పెద్ద మైనస్ పాయింట్ క్వాలిటీ మేకింగ్ అని చెప్పాలి.

- Advertisement -

టీజర్ చూస్తుంటే షార్ట్ ఫిల్మ్ క్వాలిటీతో చూస్తున్న ఫీలింగే కలగగా, ఆర్టిస్ట్ లు కూడా హీరోయిన్లతో సహా, చాలా మంది షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ లు ఉండడం వల్ల ఆ ఫీలింగ్ కలిగిందని చెప్పొచ్చు. అయితే కంటెంట్ బాగుంటే ఇదేదీ పట్టించుకోకుండా సినిమాని హిట్ చేసేయొచ్చు ఆడియన్స్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు