Biggboss season 7: అటు భోలే, ఇటు అశ్విని ఇద్దరికీ ఒకేసారి?

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్ల కంటే బెస్ట్ గా రన్ అవుతుంది. ఈ సీజన్ మొత్తం ఉల్టా పల్టా గా ఉంటుందని నాగార్జున చెప్పేయగా, అలాగే రన్ అవుతుంది. టాస్కు లతో సహా, ఎలిమినేషన్లు కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి. ఇక ఈ వారం జరిగిన నామినేషన్ టైం లో కొత్త కంటెస్టెంట్స్ భోలే షావలి, అశ్విని శ్రీ చేసిన రచ్చ గురించి తెలిసిందే.

ఇటు ప్రియాంక, అటు శోభా శెట్టి ఇద్దరూ నామినేట్ చేస్తుండగా, భోలే ప్రవర్తనతో, వెకిలి చేష్టలతో విసిగిపోయిన ఇద్దరూ ఓ రకంగా గొడవకి దిగారని చెప్పాలి. ఆ క్రమంలో భోలే నోటివెంట కొన్ని తప్పుడు పదాలు రాగా, దానికి ప్రియాంక, శోభా చాలా బాధ పడ్డారు.

ఇక అశ్విని కూడా నామినేట్ చేసే టైం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో నోరు జారింది. అమర్ తో గాని, ప్రియాంక, శోభా తో అనవసరమైన వాగ్వాదానికి దిగింది. నామినేషన్ ప్రాసెస్ ని కూడా అర్ధం చేసుకోలేక, బిగ్ బాస్ లో ఓ జోకర్ అయింది.

- Advertisement -

ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమో లో నాగార్జున ఈ వారం అందరికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భోలే ఎర్రగడ్డ మ్యాటర్ లో నాగ్ బాగా సీరియస్ అయ్యాడని తెలుస్తుంది. మరి ఈ వారం ఎలిమినేషన్ లో భోలే, అశ్విని లు కూడా నామినేట్ కాగా, వాళ్లలో ఎవరు సేఫ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు