Jinthaak : పక్కా మాస్

సినీ లవర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాస సాంగ్స్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ కూడా మాస్ పాటలకే మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు చాలా వరకు మాస్ సాంగ్స్ వచ్చాయి. తాజాగా మరో మాస్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం వస్తున్న సినిమా ధమాకా. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీల నటిస్తుంది. ఈ సినిమాలో జింతాక్ జింతాక్ అనే పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

విక్రమార్కుడు సినిమాలో ఉన్న జింతాక్ జింతాక్ అనే మూమెంట్ తో ఈ పాటను కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ ను మంగ్లీ, భీమ్స్ సిసిరోలియో కలిసి పాడారు. వీరి వాయిస్ పాటకు హైలైట్ గా ఉంది. మంగ్లి మార్క్ వాయిస్ ఈ పాటకు కలిసొచ్చింది. 54 ఏళ్ల వయస్సులో రవితేజ మాస్ డ్యాన్స్ కు తోడు యంగ్ హీరోయిన్ శ్రీలీల ఎనర్జీ సూపర్ గా ఉంది. అలాగే రవితేజ విక్రమార్కుడు సినిమాలోని జింతాక్ జింతాక్ ని వాడటం వల్ల ప్రేక్షకలకు సులవుగా చేరింది. ఇలాంటి ప్రయోగాన్ని ఈ మధ్య కాలంలో నితిన్ కూడా చేశాడు.

ఇటీవల వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని రా.. రా.. రెడ్డి పాటలో జయంలోని “రాను రాను అంటుందో..” అనే పాటను వాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రావితేజ కూడా అదే ప్రయోగం చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు