Janhvi Kapoor : చెల్లికి డేటింగ్ ట్రిక్స్

అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి – బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని ల‌వ్‌ చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు జాన్వీ, ఖుషి కపూర్ లు జన్మించారు. అయితే కొద్ది రోజుల తర్వాత శ్రీదేవి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీదేవి తన ఇద్దరు కూతుర్ల‌ను హీరోయిన్ గా వెండితెరపై చూడాలని.. ఇందుకోసం పెద్ద కూతురు జాహ్నవి మొదటి సినిమా బాధ్యత అంతా తానై చూసుకుంది.

ఇక ఆ తర్వాత జాన్వి కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జాన్వి కపూర్ సౌత్ లో సినిమాలు చేయకపోయినా ఆమెకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.తాజాగా జాన్వి కపూర్ డేటింగ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన సోదరి ఖుషీ కపూర్ కి డేటింగ్ సలహాలు ఇచ్చింది జాన్వీ కపూర్.

ఒకవేళ డేటింగ్ చేయాల్సి వస్తే.. నటుడితో మాత్రం అసలు చేయకూడదని తన సోదరికి చెబుతానని జాన్వి చెప్పింది. తాను, తన సోదరీ ఓకే మనస్తత్వం కలిగిన వారిమని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఖుషి కపూర్ “ది ఆర్భీస్” అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. మరోవైపు ఇప్పటికే తెరంగేట్రం చేసిన జాన్వి కపూర్ వరుస సినిమాలతో అలరిస్తోంది. కాగా ఇప్పటికే ఎన్నోసార్లు జాన్వికపూర్ డేటింగ్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు