Tillu Square Collections : భారీ ఓపెనింగ్స్… బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Tillu Square Collections : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ, హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ టిల్లు స్క్వేర్. 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా రూపొందింది టిల్లు స్క్వేర్. ఈ సీక్వెల్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా, ఎన్నో అంచనాలతో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కు ముందే టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసింది. పలు వాయిదా అనంతరం మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీకి అసలు షోస్ పడకుండానే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషం. అలాగే ఓవర్సీస్ లో ప్రీ టికెట్ సేల్స్, ప్రీమియర్స్ ద్వారా మంచి కలెక్షన్లు రాబట్టింది.

అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ కలెక్షన్స్…

టిల్లు స్క్వేర్ మూవీ ఓవర్సీస్ లో ప్రీ టికెట్ సేల్స్ ద్వారా 250k డాలర్లు రాబట్టింది. అలాగే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ నుంచి 450K డాలర్స్, ఆస్ట్రేలియాలో 47K డాలర్స్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే డే పూర్తయితే ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతంలో డీజే టిల్లు మూవీ నార్త్ అమెరికాలో ఫుల్ రన్ లో 554 కే, ఆస్ట్రేలియాలో 111K డాలర్స్ కొల్లగొట్టింది. ఇక ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. కేవలం హైదరాబాద్ లోనే టిల్లు స్క్వేర్ మూవీకి 1.25 కోట్ల గ్రాస్ బుకింగ్స్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ( Tillu Square Collections ) 2.5 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ నాగ వంశీ మొదటి రోజు ఈ మూవీ 25 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ మూవీకి మొదటి రోజు 1.56 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫుల్ రన్ లో టిల్లు స్క్వేర్ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నాగ వంశీ కామెంట్స్ చేశారు. కాగా టిల్లు స్క్వేర్ మూవీకి 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి అడుగు పెట్టాలంటే 28 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి టిల్లు స్క్వేర్ నిర్మాతల అంచనాలను అందుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెరపైకి పార్ట్ 3… అదే బ్యానర్ పై…

డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్  ఈరోజు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీకి మూడవ భాగం కూడా తెరకెక్కబోతుందని టాక్ నడుస్తోంది. దాన్ని కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తారని అంటున్నారు. టిల్లు క్యూబ్ పేరుతో ఈ సీక్వెల్ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం మూవీకి వచ్చినా పాజిటివ్ టాక్ తో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు టిల్లు జోరును చూస్తుంటే కలెక్షన్స్ పరంగా దూసుకెల్లడం ఖాయం అనిపిస్తుంది. ఎట్టకేలకు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీతో అటు ఆడియన్స్, ఇటు చిత్ర బృందం సంతోషంగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు