Bichagadu2: స్పీచ్ ఇవ్వడం తనకు చేతకాదంటున్న హీరోయిన్

విజయ్ ఆంటోని హీరోగా స్వీయ దర్శకత్వంలో అన్ని తానై తెరకెక్కించిన సినిమా “బిచ్చగాడు2”. ఈ సినిమా 2016లో వచ్చిన బిచ్చగాడు మూవీకి సిక్వెల్. అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ వేరు. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోట్లు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాకి సిక్వెల్ వచ్చింది. అయితే బిచ్చగాడు సినిమాకి తమిళ డైరెక్టర్ శశి దర్శకత్వం వహించగా బిచ్చగాడు2 కి మాత్రం విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ముంబై బ్యూటీ కావ్య థప్పర్ హీరోయిన్ గా నటించింది.

తాజాగా బిచ్చగాడు2 సినిమా తెలుగు ప్రెస్ మీట్ మే6న హైదరాబాద్ లో జరిగింది. ఆ ప్రెస్ మీట్ కి ఆర్. నారాయణమూర్తి అతిధిగా హాజరయ్యారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమదైన శైలిలో సినిమా గురించి స్పీచ్ ఇచ్చారు. అయితే ఈ మూవీ హీరోయిన్ అయిన కావ్య థప్పర్ మాత్రం కొంచెం సిగ్గుపడుతూ ఇబ్బందిగా మాట్లాడింది. అంతకు ముందు స్పీచ్ ఇచ్చిన నారాయణమూర్తికి ప్రెస్ మీట్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మీ అంత ధైర్యంగా డేరింగ్ గా నేను మాట్లాడలేను అని అంది.

ఇక ఆ తరువాత మూవీ గురించి చెప్తూ ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు విజయ్ ఆంటోని కి ధన్యవాదాలు చెప్పింది. అలాగే ఈ సినిమాలో తనతో పాటు నటించిన వారందరికీ, ఇంకా ఈ తనకోసం వర్క్ చేసిన మేకప్ ఆర్టిస్టులకి, ఇతర ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ చెప్పింది. బిచ్చగాడు2 మే19 న థియేటర్లలో చూడమని చెప్తూ స్పీచ్ ముగించింది. కావ్య థప్పర్ తెలుగులో ఇంతకు ముందు “ఏక్ మినీ కథ” మూవీలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు