Hanuman : అక్కడ తెలుగు స్టేట్స్ ని మించి దుమ్ములేపుతున్నాడు..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాల్లో “హనుమాన్” బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ విన్నర్ గా నిలవగా, సంక్రాంతి సినిమాలు థియేటర్ల లోంచి వెళ్లిపోగా, హనుమాన్ మాత్రం ఇప్పటికి చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్ములేపుతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ అయిన మొదటి వారమే 80 కోట్లకి పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా డే బై డే వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది.

అయితే తాజాగా హనుమాన్ ఓ అరుదైన రికార్డుని నెలకొల్పింది. అయితే అది ఇక్కడ కాదు ఓవర్సీస్ మార్కెట్ లో.. అవును అది కూడా టాలీవుడ్ టాప్ హీరోలకి కూడా అందని రికార్డ్ అది. సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయిన హనుమాన్ అక్కడ ప్రీమియర్స్ నుండి భారీ కలెక్షన్లు సాధించగా, మూడో వారంలోకి ఎంటర్ అయిన హనుమాన్ ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ విషయాన్నీ మేకర్స్ అఫిషియల్ గా పోస్టర్ ద్వారా తెలియచేయడం జరిగింది.

ఇక ఓవర్సీస్ లో టాప్ 5 లో మొదటి స్థానం లో బాహుబలి2, రెండో ప్లేస్ లో RRR, మూడో ప్లేస్ లో బాహుబలి, నాలుగో ప్లేస్ లో సలార్, ఉండగా తాజాగా టాప్ 5 లోకి హనుమాన్ మూవీ ఎంటర్ అయింది. ఇక మూడో వారం పూర్తయ్యే సరికి హనుమాన్ 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు