Guppedantha Manasu Jagathi: జగతి మేడంకు రెండో పెళ్లి అయిపోయింది… ఫైనల్‌గా చెప్పేసిందిగా

Guppedantha Manasu Jagathi

ప్రముఖ కన్నడ నటి జ్యోతి రాయ్… ఈ పేరు చెబితే మన తెలుగు వాళ్లకు అర్థం కాదు. అదే… గుప్పడంత మనసు జగతి మేడం అని చెప్పిన వెంటనే గుర్తు పట్టేస్తారు. ఆమెను సోషల్ మీడియాలో రెగ్యూలర్ గా ఫాలో అవుతామని చెబుతారు. ఆమె అందానికి ఫిదా అయిపోతామని అంటారు. ఇంకా చాలా చెబుతారు. అయితే ఈ అమ్మడు డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది అంటూ చాలా రోజుల నుంచి ఓ గాసిప్ ఇటు సోషల్ మీడియాలో అటు బయట చాలా వైరల్ అయింది.

జ్యోతి రాయ్ అంటూ ఉన్న తన పేరు వెనకాల పూర్వాజ్ అని యాడ్ చేసుకున్న టైంలోనే జగతి మేడం పెళ్లి జరిగిపోయిందని, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు అంతే అని అనుకున్నారు. ఇప్పుడు అది కూడా జరిగిపోయింది. సుకు పూర్వాజ్ పుట్టిన రోజు సందర్భంగా తమ పెళ్లి విషయాన్ని అధికరికంగా చెప్పేసింది.

Guppedantha Manasu Actress Jyothi Rai comments on Director Suku Purvaj

- Advertisement -

డైరెక్టర్ సుకు పూర్వాజ్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ఒక నోట్ ను రిలీజ్ చేసింది. ఆ నోట్ ను తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంచింది. ఇదే నోట్ ను తర్వాత డైరెక్టర్ సుకు పూర్వాజ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా తీసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Guppedantha Manasu Actress Jyothi Rai comments on Director Suku Purvaj

ఈ స్టోరీలో… “మనం కలిసి దాదాపు ఏడాది అయిపోయింది. ఆ నాటి నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. నా ఫీలింగ్స్ చెప్పడానికి నాకు వచ్చే మాటలు సరిపోవు. నీ నుంచి నాకు వచ్చే హగ్స్, సపోర్ట్, పాజిటివ్ థాట్స్, సహనం, విధేయతతో పాటు నీ కేరింగ్ కు చాలా థాంక్స్. నువ్వు నా భర్తగా దొరకడం నా అద్రుష్టం. విష్ యూ ఏ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే డార్లింగ్. లవ్ యూ” అంటూ జగతి మేడం రాసుకొచ్చింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు